
బీసీల చైతన్యం కోసమే ఉద్యమం
జనగామ రూరల్: బీసీల అస్తిత్వ చైతన్యం కోసమే ఉద్యమమని మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింగరావు అన్నారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆవిర్భవించిన మన ఆలోచనల సమితి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి బీసీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ సంఘాల సమన్వయ వేదిక సమన్వయ కర్త కన్న పరశురాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింగరావు మాట్లాడుతూ మా వాటా మాకే, మన ఓటు మనకే నినాదం గ్రామాల్లో చర్చ జరగాలని, అప్పుడే రాజ్యాధికార సాధన సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి జిల్లా కన్వీనర్లు గునిగంటి రామకృష్ణ, పన్నీర్ సత్యం జి. కృష్ణ, బొమ్మగాని అనిల్ గౌడ్, బైరు బాబు, చంద్రయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.