
విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
జనగామ రూరల్: కేంద్రం విద్యుత్ సవరణ చట్టం చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందూనాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కార్యదర్శి మంగ భీరయ్య అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం పట్టణ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే పత్తి పంట కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రైస్ డెఫిసిటీ పేమెంట్ స్కీమ్ వెనక్కి తీసుకోవాలన్నారు. జిల్లాలో 8000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటే కేవలం 6,000 మెట్రిక్ టన్నులు మాత్రమే అందిందని, దీంతోనే యూరియా కొరత ఏర్పడిందన్నారు. తక్షణమే రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, రామావత్ మీట్యా నాయక్, ఉర్సుల కుమార్, నంద రాములు, కే.వెంకన్న, కర్రె రాములు, సత్తయ్య, బీరయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.