
ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలి●
● జిల్లా పంచాయతీ అధికారి స్వరూప
జఫర్‌గఢ్: ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి స్వరూప కోరారు. మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణతో పాటు గ్రామ పరిసరాలు, అంగడిని పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.