
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: ఏడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆన్‌లైన్‌లో నమోదు కాని జీపీ కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సీహెచ్ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం కోశాధికారి బస్వ రామచంద్రం, కంబాలోజు రాజు, ఇట్టబోయిన మహేందర్ పగిడిపల్లి మల్లేశ్, ఉపేందర్, ఆంజనేయులు, సమ్మయ్య, ముత్యం, దేవి వినోద, మధు, మారపాక లక్ష్మి, ఆకారపు యాదమ్మ, బాల్నే రాధిక, బొంకూరి భారత తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద జీపీ కార్మికుల ధర్నా
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు