
ఓటరు జాబితా సవరణకు ఇంటింటి సర్వే
స్టేషన్‌ఘన్‌పూర్: ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు తదితర సవరణలు చేపట్టి తుది జాబితా కోసం త్వరలో ఇంటింటి సర్వే చేపట్టననున్నట్లు ఆర్డీఓ డీఎస్ వెంకన్న తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి గురువారం చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక తహసీల్ కార్యాలయంలో ఆర్డీఓతో పాటు వివిధ మండలాల తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. వీసీలో అఽధికారులకు, ఎన్నికల సిబ్బందికి పలు సూచనలిచ్చారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను తాజా పర్చుటకు ఇంటింటా సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఘన్‌పూర్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, ఎన్నికల సిబ్బంది శ్రీప్రియ, మహిపాల్‌రెడ్డి, రాజకీయ పార్టీల నాయకులు తెల్లాకుల రామకృష్ణ, కె.శరత్‌కుమార్, జలగం ప్రవీణ్, తోట రమేశ్, సారయ్య పాల్గొన్నారు.
ఆర్డీఓ డీఎస్ వెంకన్న