
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ఉపాధ్యాయులకు సమయపాలన ఎంతో ప్రధానమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి బి.శ్రీనివాస్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి ఛాగల్లు, స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి ప్రభుత్వ పాఠశాలల సముదాయాల సమావేశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులంతా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్ని వినియోగించుకోవాలని, నూతన బోధన పద్దతులను మెరుగుపర్చుకునేందుకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కొమురయ్య, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు ఎం.సంపత్, కుసుమ రమేశ్, సెక్రటరీలు సోమనారాయణ, శ్రీధర్, ఎమ్మార్సీ సిబ్బంది గిరి, లవన్, శ్రీలత, జ్యోతి, వెంకటేశ్వర్లు, రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.