
‘ఇందిరమ్మ’ నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
స్టేషన్‌ఘన్‌పూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా మొదలుపెట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిప ల్ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్యకలాపాలను విస్తృతం చేయాలని, మున్సిపల్ ఆదాయం పెంచేదిశగా ప్రణాళికతో ముందుకుసాగాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభు త్వ నిబంధనల మేరకే నిర్మాణాలు చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. సాంకేతిక సమస్య వస్తుందని పలువురు తెలపగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.