
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జనగామ: సీజనల్ వ్యాధులపై వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మలేరియా, పైలేరియా అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్‌సింగ్ నాయక్ ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ రాజలింగం, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావులతో కలిసి బుధవారం జిల్లా ఆస్పత్రితో పాటు జఫర్‌గఢ్ మండలం కూనూరు పీహెచ్‌సీని సందర్శించారు. అంతకుముందు స్టేషన్‌ఘన్‌పూర్ వైద్యాధికారులతో గూగుల్ మీట్‌లో మాట్లాడారు. డెంగీ వ్యాధి కేసులు నమోదైన సమయంలో వైద్యాధికారులు, సబ్ యూనిట్ అధికారులు అలర్ట్‌గా ఉండాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. అనంతరం తెలంగాణ డయాగ్నోస్టిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ల్యాబ్ పరికరాలను ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై ఆరా తీశారు.
మలేరియా, పైలేరియా అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్