
లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్ష ప్రశాంతం
జనగామ: లైసెన్స్‌డ్ సర్వేయర్ల అర్హత పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కో–ఆర్డినేటర్ మన్యంకొండ పర్యవేక్షణలో పట్టణంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాలలో అర్హత పరీక్ష నిర్వహించారు. మొదటి సెషన్ 10 గంటలకు ప్రారంభం కాగా, 9 గంటల నుంచే లోనికు అనుమతించారు. రెండు సెషన్లలో జరిగిన అర్హత పరీక్ష సీసీ కెమెరా నిఘా నీడలో జరిగింది. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరిగింది. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో సీఐ, ఎస్సైలు సెంటర్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. 144 సెక్షన్ అమలు చేసి, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌లో జరిగిన గ్రామ పరిపాలన ఆఫీసర్స్ (జీపీఓ) అర్హత పరీక్షకు 23 మందికి గాను 22 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఒక్కరు గైర్హాజరయ్యారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్షకు మొత్తం 173 అభ్యర్థులకు మొదటి సెషన్‌లో ముగ్గురు, రెండో సెషన్‌లో ఆరుగురు గైర్హాజరయ్యారు. కాగా రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ పరీక్ష తీరును పరిశీలించారు.
మొదటి సెషన్‌లో ముగ్గురు,
రెండో సెషన్‌లో ఆరుగురు గైర్హాజరు

లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్ష ప్రశాంతం

లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్ష ప్రశాంతం