
108 సేవలకు రెండు దశాబ్దాలు
జనగామ: దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి 108 అంబులెన్స్ సేవలను ప్రారంభించి ఆదివారం నాటికి రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని 108 అంబులెన్స్ సెంటర్‌లో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అంబులెన్స్ నిర్వహణ జిల్లా కోఆర్డినేటర్ వి.రామును ఉద్యోగులు బిల్ల రాజు, రాకేష్, వీరన్న, అనిల్, రాజు, రమేష్, నరేష్, మల్లేష్, హరీష్, రఘు, రాజు ఘనంగా సన్మానించారు. ఆపదలో ఉన్న క్షతగాత్రులకు ప్రాణం పోయాలనే సంకల్పంతో ప్రవేశ పెట్టిన 108 అంబులెన్స్‌లు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపాయని రాము అన్నారు. నేడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో 108 సేవలను నడిపిస్తున్నారన్నారు. ఈ సేవలో ప్రత్యక్షంగా తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.
జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు