
కనుల పండువగా విగ్రహ ప్రతిష్ఠాపన
జనగామ: జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని శ్రీలక్ష్మీగణపతి దుర్గాదేవి ఆలయంలో లోక కల్యాణార్థం శివ, నంది, ద్వజ శిఖర, నాగేంద్రస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివా రం కనుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 7.30 గంటల కు గణపతి పూజతో ప్రతిష్ఠాపన వేడుకలను మొదలు పెట్టారు. కలష స్థాపన, మండపారాధన, జలధివాసము, ధాన్యాది, పుష్పాది, అన్నాధి, శయ్యాది వాసము, హిరణ్యాధివాసము, యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ మహా బలి నివేదిన, స్థాపిత దేవత మూల యంత్ర హవనములు, ప్రతిష్ఠాంగ హోమం తదిత ర పూజా కార్యక్రమాలతో విగ్రహ ప్రతిష్ఠాపనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు లింగమూర్తి, మాధరపు రాజు, గంగిశెట్టి మనోజ్ కుమార్, శెట్టి రవి, రామాంజనేయులు, గాదె శ్రీను, తమ్మిశెట్టి మల్లికార్జున్, సుధాకర్‌రెడ్డి, హరిబాబు, శెట్టి వెంకన్న, సతీష్ పాల్గొన్నారు.