
జిమ్, యోగాతో ఆరోగ్య రక్షణ
● డీసీపీ రాజమహేంద్రనాయక్
పాలకుర్తి టౌన్: ఆరోగ్య రక్షణకు వాకింగ్, జిమ్, యోగా ఎంతో ఉపయోపడుతుందని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని దేవస్థానం ఆర్చి సమీపంలో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్‌ను డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలతో బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని, ఉక్కులాంటి యువతరం తయారు కావాలన్నారు. పిల్లలు, యువత, పెద్దలు వ్యాయామ సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ జానకిరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్, జిమ్ నిర్వాహకుడు చెరిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.