
అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ
● సదాశయ ఫౌండేషన్
జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్
● ప్రొఫెసర్ ప్రభంజన్ సంస్మరణ సభ
పాలకుర్తి టౌన్: అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ లభిస్తుందని, మరణ అనంతరం కూ డా మానవ శరీరాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని సదాశయ ఫౌండేషన్ జాతీ య అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, చౌడవరపు లింగమూర్తి అన్నారు. శనివారం మండలంలని గూడూరులో సీనియర్ జర్నలిస్టు, ప్రొఫెసర్ యాదాలన ప్రభంజన్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీర దానం వైద్య కళాశాల విద్యార్థుల విద్యాబోధనకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ప్రభంజన్ సతీమణి మంచిర్యాల వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖ మాట్లాడుతూ తన భర్త ఉన్నంతకాలం జర్నలిజం ప్రొఫెసర్‌గా, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేవారన్నారు. అ నంతరం ఫౌండేషన్ జ్ఞాపికను ప్రభంజన్ కు టుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో కన్వీనర్ చౌడవరపు శ్రీనివాస్, ప్రొఫెసర్ శ్రీకాంత్, రాజయ్య, రవీందర్, తదితురులు పాల్గొన్నారు.