
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి
జనగామ రూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. శనివారం మండలంలోని యశ్వంతపూర్, పెంబర్తి, ఓబుల్‌కేశవాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పిల్లలకు టీకాలు వేయించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామంలోని నిల్వ నీటి ప్రదేశాలు, మూసివేయని కాల్వలను శుభ్రం చేయాలని, చెత్త తొలగింపునకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలు సమన్వయంతో గ్రామ పర్యటనలు నిర్వహించి దోమలు అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇఫ్తాకరుద్దిన్, వైద్యులు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు