
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
జిల్లా కేంద్రంలో ఈనెల 27న నిర్వహించే లైసెన్స్ సర్వేయర్ల అర్హత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 173 మంది అభ్యర్థులు హాజరు కానుండగా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. సెంటర్‌లో విద్యుత్, తాగునీరుతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు.