
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలి
కొడకండ్ల: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి రోజు కాచి చల్లార్చిన నీటిని విద్యార్దులు తాగేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ సూచించారు. గురువారం మండలకేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ప్రతీ రోజు ఉపాధ్యాయులు తెలుసుకోవాలని, విద్యార్థులతో కల్సి ఉపాధ్యాయులు భోజనం చేయాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖల అధికారులు వసతి గృహాలను సందర్శించి సిబ్బంది పనితీరును తెలుకుంటూ విద్యార్థులతో భోజనం చేయాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రిజిస్టర్లను పరిశీలించా రు. ఆయన వెంట ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు విక్రమ్‌కుమార్, రవీందర్, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
జనగామ రూరల్: సీజనల్ వ్యాధులపై వైద్యరోగ్య శాఖ డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు ఆదేశించారు. జనగామ మండలం గానుగుపహాడ్‌లో రెండు డెంగీ కేసులు నమోదు కావడంతో గురువారం డీఎంహెచ్‌ఓ గ్రామంలో పర్యటించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు నిర్లక్ష్యం చేయొద్దని గ్రామ పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కోమల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో గానుగుపహాడ్‌లో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. జ్వరాలపై ఇంటింటి సర్వే చేపట్టి, లక్షణాలు గుర్తించిన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్