
రైతులకు అధికారులు సహకరించాలి
●
● వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు పరశురామ్‌నాయక్
● మూడు మండలాల అధికారులతో
సమావేశం
పాలకుర్తి: రైతులకు వ్యవసాయ అధికారులు పంటల సాగు విధానం తదితర అంశాల్లో సహకరించాలని డివిజనల్ వ్యవసాయ సంచాలకుడు అజ్మీరా పరశురామ్ నాయక్ అన్నారు. బుధవారం పాలకుర్తి రైతు సేవా కేంద్రంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల స్థాయి వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రైతు తమ భూముల పట్టాదారు పాసుబుక్ తీసుకుని ఏఈఓల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై వివరించారు. డివిజన్‌లోని అన్ని మండలాకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను పరిశీలించాలని అన్నారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్ ఏఓ విజయ సాయిరెడ్డి, ఏఈఓలు వెంకటేశ్, రాధిక, మహేష్, దీపక్, రేవంత్, కీర్తి, సన, సువర్ణ, నవ్య, భాస్కర్, సాయి కిరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.