జనగామ: ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలతో జనగామ పట్టణ వీధులు, ప్రధాన రహదారులు గలీజుగా మారిపోతున్నాయి. డ్రెయినేజీలు నిండి.. మురికి నీరు ౖపైపెకి ఉబికి వస్తుండడంతో వ్యాపార, వాణిజ్య సముదాలతో పాటు ఇళ్ల గడప ముందుకు చేరుకునే పరిస్థితి నెలకొంది. పది నిమిషాలు చిరుజల్లులు కురిస్తేనే ఇంతటి పరిస్థితి నెలకొంటే.. భారీ వర్షం నమోదైతే పట్టణ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతుంది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపధ్యంలో పురపాలిక అధికారులు కనీసం అప్రమత్తత లేకుండా పోయారు.
భయం గుప్పిట్లో మున్సిపల్ ఉద్యోగులు..
పురపాలికలో అనేక అక్రమాలపై విచారణ కొనసాగుతుండగా, ఇందులో ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటుపడగా.. వరుస క్రమంలో ఉంటానేమోననే భయం చాలా మందికి పట్టుకున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతుంది. రోడ్లపైకి వచ్చే మురికి నీటిని ఎవరికి వారే శుభ్రం చేసుకునే పరిస్థితి పట్టణంలో నెలకొంది. హైదరాబాద్ రోడ్డులో వరద నీరు నిలిచి ద్విచక్ర వా హనం వెళ్లలేని పరిస్థితుల్లో కనీసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదు. డ్రెయినేజీ, చెత్త నిర్వహణ గాడి తప్పడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు వివిధ అనారోగ్యాల బారిన పడుతూ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి నెలకొంది. మున్సిపల్‌పై అజమాయిషీ చేయాల్సిన సీడీఎంఏ అధికారులు సైతం మెమోలతోనే సరిపెడుతున్నారని ప్రజలు బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కాలనీలను ముంచెత్తిన వరద
గడప ముందుకు మురికి నీరు
ఎవరికి వారే శుభ్రం చేసుకుంటున్న వైనం
వానొస్తే రోడ్లన్నీ చిత్తడే..