
స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం
జనగామ: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళా శాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1974–75 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒక్కచోట కలుసుకుని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాటి గురువులు నేర్పి న క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన కొలిపాక బాలయ్య, నర్సింహారెడ్డి, రామస్వామి, భాగ్యలక్ష్మి గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బచ్చు రమేశ్, నర్సింహాప్రసాద్, బండిరాజుల శంకర్, అల్లాడి మహేశ్వర్, సోమ హనుమంత్‌రావు, స్వామి, కుమారస్వామి, రాజిరెడ్డి, నీలం మధు, నాయిని రమేశ్, ఖలీముల్లా తదితరులు పాల్గొన్నారు.