
పెండింగ్ ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలి
జనగామ రూరల్: గీత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా వెంటనే విడుదల చేసి, సేఫ్టీ కిట్లు అందించాలని కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి అన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బాధితులతో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్ ఉన్న ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచినా.. ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. సుమారు రూ.12.96 కోట్ల ఎక్స్‌గ్రేషియా పెండింగ్‌లో ఉందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు బాల్నే వెంకటమల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో 106 మందికి సుమారు రూ. 2.11కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. తాటి కార్పొరేషన్ నుంచి తక్షణ సాయం ఇవ్వాలని, మెడికల్ బోర్డు విధానా న్ని ఎత్తివేయాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతీ గీత కార్మికుడికి పింఛన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకటి రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు జొన్నగొని శ్రీనివాస్, బండమీది వెంకన్న, వడ్లకొండ వెంకటేష్, పరిధుల భా స్కర్, బండపల్లి శంకరయ్య, ఘనగాని రమేశ్, మహేందర్, పరంధామ తదితరులు పాల్గొన్నారు.
కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి గోపి