
కలెక్టర్‌కు సీఎం ప్రశంస
జనగామ: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దేశంలోని 50 అత్యుత్తమ జిల్లాల్లో రాష్ట్రం నుంచి జనగామ జిల్లాకు చోటు దక్కడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికార యంత్రాంగం పని చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఇదే నిదర్శనమంటూ అందులో పేర్కొన్నారు. ఇంతటి విజయానికి కారణమైన కలెక్టర్ చొరవ, రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. కలెక్టర్‌కు తన ప్రత్యేక అభినందనలంటూ
పేర్కొన్నారు.