అక్రమాలకు పాల్పడితే జైలు తప్పదు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు పాల్పడితే జైలు తప్పదు

Jul 18 2025 5:22 AM | Updated on Jul 18 2025 5:22 AM

అక్రమాలకు పాల్పడితే జైలు తప్పదు

అక్రమాలకు పాల్పడితే జైలు తప్పదు

లింగాలఘణపురం: ప్రజలు ఇచ్చిన అధికారంతో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడితే జైళ్లకెళ్లడం తప్పదని, ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరు జైలుకెళ్లి వచ్చారని, మిగిలిన వారు వెళ్లకతప్పదని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు. గురువారం మండలంలోని జీడికల్‌– కళ్లెం రోడ్డు శంకుస్థాపన, అసంపూర్తి కాలువ పనుల పరి శీలన, రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.8 కోట్లతో జీడికల్‌–కళ్లెం రోడ్డుకు మార్చి 16న సీఎం రేవంత్‌రెడ్డి వేసిన శిలాఫలాన్ని ఎమ్మెల్యే కడియం జీడికల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ కుటుంబం అవినీ తి, అక్రమాలకు పాల్పడిందని కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల్లో జైలుకు వెళ్లకతప్పదని అన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డు వస్తుందని, కొత్త పేర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చి హామీలను అమలు చేస్తు న్నా.. కొంత మందికి అభివృద్ధి కనిపించడంలేదని అన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. నవంబర్‌లో జరిగే జీడికల్‌ జాతర నాటికి జీడికల్‌–కళ్లెం రోడ్డు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరారు. అంతకు ముందు జీడికల్‌ వద్ద అసంపూర్తిగా ఉన్న దేవాదుల కాలువ పనులను పరిశీలించారు. వారం రోజుల్లో గా పనులు పూర్తి చేయాలని అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ కాలువ నుంచి జీడికల్‌, రామచంద్రగూడేనికి నీళ్లు అందజేస్తామని చెప్పారు. రూ.30వేల స్వంత డబ్బులతో భూమి కోల్పోతున్న రైతు ప్రశాంత్‌ భూ మిలో దారి ఏర్పాటు చేస్తానని చెప్పారు. సిరిపురంలో కొంత భూసేకరణలో భూమి కోల్పోతున్న రైతు శశాంక్‌తో ఫోన్‌లో మాట్లాడి కాలువ తీసేందుకు సహకరించాలని కోరారు. జీడికల్‌ వీరాచల రామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌, డీసీఎస్‌ఓ సరస్వతి, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్‌ రవీందర్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ శివకుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు ఉపేందర్‌, మల్లేశం, మార్కెట్‌ డైరెక్టర్లు మోహన్‌, శ్రీలతారెడ్డి, నీటిపారుదల శాఖ డీఈ రవికుమార్‌, పీఆర్‌డీఈ రవీందర్‌, ఏఈ శ్రీనివాసు, వంశీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ పైసా ఇవ్వొద్దు

రఘునాథపల్లి: ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం ఎవరైనా ఒక్క రూపాయి అడిగినా తమకు చెప్పాలని, ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలకు సూచించారు. గురువారం మండలంలోని ఇబ్రహీంపూర్‌లో నిడిగొండ నుంచి ఖిలాషాపూర్‌కు రూ.6 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు, ఫతేషాపూర్‌లో రూ.20 లక్షలతో మంజూరైన ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణాలకు శిలాఫలకాలు ఆవిష్కరించిన అనంతరం ఖిలాషాపూర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌తో కలిసి నూతన రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించి వారంలో గోదావరి జలాలు చెరువుల్లో నింపేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఫతేషా పూర్‌ మహిళా సంఘాలకు ఎంపీ నిధుల నుంచి భవనం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 18 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాంబాబు, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, తహసీల్దార్‌ ఫణికిశోర్‌, జగదీష్‌చందర్‌రెడ్డి, అజయ్‌, నర్సింహారెడ్డి, సారయ్య, క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement