14.06 టీఎంసీలు.. 6.46 లక్షల ఎకరాలు | - | Sakshi
Sakshi News home page

14.06 టీఎంసీలు.. 6.46 లక్షల ఎకరాలు

Jul 18 2025 5:22 AM | Updated on Jul 18 2025 5:22 AM

14.06 టీఎంసీలు.. 6.46 లక్షల ఎకరాలు

14.06 టీఎంసీలు.. 6.46 లక్షల ఎకరాలు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: నీటిపారుదల శాఖ వరంగల్‌, ములుగు సర్కిళ్ల పరిధిలో వానాకాలం సాగునీటి విడుదల యాక్షన్‌ ప్లాన్‌ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, వర్షం, వరదలను అంచనా వేసి ఉమ్మడి వరంగల్‌లో ఖరీఫ్‌ పంటలకు నీరిందించే విధంగా ప్రణాళికను ప్రకటించింది. 2,52,623 ఎకరాల తరి, 3,94,041 ఎకరాల ఆరుతడి కలిపి మొత్తం 6,46,664 ఎకరాలకు 14.06 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయనున్నట్లు యాక్షన్‌ ప్లాన్‌లో పేర్కొంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్‌సీఐడబ్ల్యూఏడబ్ల్యూ (స్కివం) సమావేశం అనంతరం సాగునీటి వివరాలను ప్రకటించారు.

నీటి విడుదల తేదీ త్వరలో ప్రకటన..

ఉమ్మడి వరంగల్‌లో వాస్తవంగా ఎస్సారెస్పీ, దేవాదుల, సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు 9,43,530 ఎకరాలు కాగా.. ప్రస్తుత పరిస్థితులు, నీటిలభ్యతను బట్టి 6,46,664 ఎకరాలకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్‌ చేసే పద్ధతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం ఇరిగేషన్‌ వరంగల్‌ సర్కిల్‌ పరిధిలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు అన్ని నింపి 2,03,641 ఎకరాలకు 11.48 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. సరిపడా వరదలు వచ్చిన తర్వాత సమీక్షించి ఎల్‌ఎండీ దిగువన కాకతీయ కాల్వ, ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా మరో 2,91,936 ఎకరాలకు నీటి సరఫరా చేస్తారు. ములుగు సర్కిల్‌ పరిధిలో 10.05 టీఎంసీలకు 2.419 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఎల్‌ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల ద్వారా 34,618 ఎకరాల తరి, 1,16,469 ఎకరాల ఆరుతడి కలిపి 1,52,087 ఎకరాలకు సుమారు 2.58 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని అధికారులను ‘స్కివం’ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు 15 రోజులకోసారి ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన వానాకాలం పంటలకు నీరందించేందుకు ప్రణాళిక సిద్ధం కాగా.. నీటిని విడుదల చేసే తేదీ లను త్వరలోనే అధికారులు ప్రకటించనున్నారు.

చీఫ్‌ ఇంజనీర్ల ప్రతిపాదనలు..

‘స్కివం’ కమిటీ సూచనలు..

ములుగు సర్కిల్‌ పరిధిలోని 1,03,883 ఎకరాల ఆయకట్టుకు అధికారులు 93,750 ఎకరాలు ప్రకటించగా.. వరద ఇన్‌ఫ్లోను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేవాదుల ద్వారా 4,170 ఎకరాలకు 3,570 ఎకరాలకు 0.35 టీఎంసీలు, పాకాల కింద 23,193 ఎకరాలకు 1.43 టీఎంసీలు, రామప్ప ద్వారా 6,780కు 0.80 టీఎంసీల నీటిని ప్రతిపాదించారు. లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగు ద్వారా 23,794 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. ఎస్సారెస్పీలో నీటి కొరత కారణంగా ఎల్‌ఎండీ, ఎస్సారెస్పీ కింద ప్రతిపాదించిన ఈ ఆయకట్టు, ఎస్సారెస్పీ స్టేజ్‌–2కు తగినంత ఇన్‌ఫ్లో వచ్చిన తర్వాత సమీక్షించనున్నట్లు ‘స్కివం’ సూచించింది. గోదావరి నదిలో తగినంత నీరు అందుబాటులో ఉన్నందున దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లను నింపాలని కూడా కమిటీ ఆదేశించింది. ఇంకా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు పంపింగ్‌ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాజెక్టుల కోసం ములుగులోని సీఈ ప్రతిపాదించిన కార్యాచరణను కమిటీ అంగీకరించి అమలు చేయాలని సిఫార్సు చేసింది.

వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక ఇది

‘స్కివం’ కమిటీ సమావేశంలో

యాక్షన్‌ ప్లాన్‌ ఖరారు

వరంగల్‌, ములుగు సీఈల

ప్రతిపాదనలకు ఆమోదం

ప్రస్తుత నీటి లభ్యతను బట్టి నిర్ణయం.. వరదలొచ్చే వరకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌..

15 రోజులకోసారి వారబందీ పద్ధతిన విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement