
మొక్కలు నాటి సంరక్షించాలి
రఘునాథపల్లి: మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన మొక్కలు నాటారు. ఆస్పత్రి పరిధిలో కొనసాగుతున్న ఫీవర్ సర్వే, స్టాప్ డయేరియా ప్రోగ్రాం, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాల కొనసాగింపుపై వివరాలు తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని, వాటితో పర్యావరణ పరిరక్షణ కాపాడుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ కమల్‌హాసన్, డాక్టర్ స్రవంతి, కమ్యూనిటీ హె ల్త్ ఆఫీసర్ రామ్‌కిషన్, సూపర్‌వైజర్లు సుజన, రజని, విష్ణువర్దన్‌రెడ్డి, పాండారి పాల్గొన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
బచ్చన్నపేట : విద్యుత్ సమ్యలను గుర్తించడానికి ట్రాన్స్‌కో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ వేణుగోపాలచారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌లో జనగామ 1, 2, జనగామ రూరల్, పెంబర్తి, బచ్చన్నపేట, పడమటికేశ్వాపూర్ సబ్ స్టేషన్‌ల పరిధిల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించగా ఆయన ముఖ్యఅథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. బచ్చన్నపేట–4. పడమటికేశ్వాపూర్–2, జనగామ రూరల్–1, లింగాలఘన్‌పూర్–1 మొత్తం 8 సమస్యలు రిజిస్ట్రర్ అయ్యాయని తెలిపారు. విద్యుత్ అధికారులు వినియోగదారుల వద్ద డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ రమేష్, ఫైనాన్స్ మెంబర్ దేవేందర్, ఇండిపెండెంట్ మెంబర్ రామారావు, ఎస్‌ఈ వేణుమాధవ్, డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, టెక్నికల్ డీఈ గణేష్, ఎస్‌ఏఓ జయరాజ్, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: గ్రూప్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌స్సీ, బ్యాంకింగ్ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సు కోసం 150 రోజులపాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణకు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.లక్ష మించకుండా, పట్టణ ప్రాంతంలో రూ.రెండు లక్షలు మించకూడదని తెలిపారు. డిగ్రీ పరీక్షలో మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.1000 చొప్పున 5 నెలల పాటు స్టైఫండ్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 0870–2571192, 040–2407118 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్, కన్వీనర్ల నియామకం
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఎన్నికల పర్యవేక్షణ కోసం జిల్లా ఇన్‌చార్జ్, కన్వీనర్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. జనగామ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్‌గా బేతి సుభాష్ రెడ్డి, కన్వీనర్‌గా ఆరుట్ల దశమంతరెడ్డిని నియమించారు. స్థానిక సంస్థల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కై వసం చేసుకునే విధంగా కేడర్‌ను సమాయత్తం చేస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యత వీరిపై ఉంది.
మెరుగైన సేవలందించి మన్ననలు పొందాలి
లింగాలఘణపురం: మండలంలోని ప్రజలకు అత్యవసర సమయంలో మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని 108 జిల్లా కోఆర్డినేటర్ వి.రాము అన్నారు. గురువారం మండల కేంద్రంలోని 108 వాహనాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అంబులెన్స్ నిర్వహణ ఎలా ఉందంటూ తెలుసుకున్నారు. 108 పైలెట్లు ఎం.రమేష్, నవీన్‌కుమార్, ఏఎంటీ బిల్లా రాజు, శ్రవణ్‌కుమార్‌లకు పలు సూచనలు చేశారు.

మొక్కలు నాటి సంరక్షించాలి