
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
జనగామ రూరల్: వ్యాపార రంగాల్లో ముందుంటూ మహిళలందరూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన ఇంది రా మహిళ శక్తి సంఘాల సంబురాలను జిల్లా గ్రా మీణ అభివృద్ధి అధికారి వసంత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీఐ సభ్యుడు అభిగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు పలు వ్యాపార రంగాల్లో ప్రావీణ్యత సా ధిస్తూ అభివృద్ధి పథంలో సాధికారత దిశగా దూసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళ క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహించడం అభినందించారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు, ధాన్యం కొనుగోళ్లతో ఇప్పటికే అభివృద్ధి పథంలో రాణిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో బస్‌ల కొనుగోలు చేపట్టారని, సోలార్ యూనిట్ల స్థాపన, పెట్రోల్ బంక్ ల ఏర్పాటు ప్రభుత్వ ఆశయం అన్నారు. ప్రతి సెంటర్‌లో ఆగస్టు 15వ తేదీ లోపు 50 వనిత టీ స్టాల్ లను చేపట్టాలన్నారు. పిల్లలను చదివించాలన్నారు. అనంతరం వివిధ మండలాల స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, డీపీఎం నళినినారాయణ పాల్గొన్నారు.
కలెక్టర్‌కు సన్మానం
న్యాస్ పరీక్షలో దేశంలో జనగామను 50వ స్థానంలోపు నిలిచేలా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కృషి చేయడం గొప్పవిషయమని ఆర్టీఏ సభ్యుడు అభిగౌడ్ అన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్‌లకు గురవారం సన్మానించారు.
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి
పాలకుర్తి టౌన్: పచ్చదనం పరిరక్షణకు ప్రభుత్వ కార్యాలయాలు ఆదర్శంగా నిలవాలని, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమర్‌తో కలిసి మొక్కను నాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ సిద్ధార్థరెడ్డి, డాక్టర్ ఉష, గాయత్రి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా ఇందిరా శక్తి సంబురాలు
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్