
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
జనగామ రూరల్ : కలెక్టరేట్ సబ్‌స్టేషన్ పరిధిలో నేడు (ఆదివారం) సబ్‌స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చంద్రమౌళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని బాలాజీనగర్, ఎల్లమ్మ గుడి, జ్యోతినగర్, కలెక్టర్ ఆఫీస్, ఆయుష్మాన్ హాస్పిటల్, అక్షయహోటల్, సెయింట్ మేరీస్ స్కూల్, సాన్ మారియా స్కూల్, ఏకశిల బీఈడీ కాలేజ్, అనంత సాయి, ఇందిరమ్మ కాలనీ, దత్తంరెడ్డి నగర్, శ్రీవిలాస్ కాలనీ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆర్‌టీఐ జిల్లా ప్రధాన
కార్యదర్శిగా రంగారావు
స్టేషన్‌ఘన్‌పూర్: ఆర్‌టీఐ, హ్యూమన్ రైట్స్ అడ్వకసీ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన పార్శి రంగారావును నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం