
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025
పక్క ఫొటోలో కనిపిస్తున్న పాఠశాల పాలకుర్తి మండల కేంద్రం ప్రాథమిక పాఠశాల. ఇందులో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు చిదురాల శ్రీనివాస్ పాఠశాల ఆవరణను తీరొక్క మొక్కలతో పచ్చలహారంగా తీర్చిదిద్దారు. మొక్కలపై హెచ్‌ఎం చూపిస్తున్న ప్రేమ, శ్రమ ఫలితంగా బడి కాస్త పచ్చదనంతో తోటలా మారిపోయింది. ప్రకృతి, పర్యావరణంపై విద్యార్థులకు బోధిస్తూ పది కాలాల పాటు ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించడం ఒక్కటే కాదు... ప్రకృతి మన నిత్యందన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందనే అవగాహన కల్పిస్తున్నామని హెచ్‌ఎం శ్రీనివాస్ తెలిపారు.
– పాలకుర్తి టౌన్
న్యూస్‌రీల్