
జీలుగతో భూసారం పెంపు
● ఏడీఏ వసంత సుగుణ
దేవరుప్పుల: వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ముందు జీలుగ వేయడం వల్ల భూసారం పెరుగుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఏడీఏ వసంత సుగుణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జీలుగ పంట సాగును ఆమె పరిశీలించారు. పంటల మార్పు చేయడంతోపాటు జిలుగు విత్తనాలు వేసి ఎదిగిన పంటను కలియదున్నడం వల్ల బలసంవర్ధకంగా భూమి మారి సాగు చేసే పంటలు రోగాల బారిన పడకుండా అధిక దిగుమతి పొందుతారని సూచించారు. రఘునాథపల్లి ఏవో ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ సాగర్, ఆదర్శ రైతులు లెక్కల ఇంద్రసేనారెడ్డి, ఆవుల సురంజన్ రెడ్డి,ఊఉగు సత్యనారాయణ, వెంకటయ్య, యాదయ్య పాల్గొన్నారు.