
మొక్కలు నాటి సంరక్షించాలి
జనగామ రూరల్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని బీసీ వెల్పేర్ అధికారి బి. రవీందర్ అన్నారు. జనగామలోని రైల్వే ట్రాక్ట్ వద్ద గల ఎంజే పీ బాలుర పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్వర్యంలో శుక్రవారం బీసీ వెల్ఫేర్ అధికారి బి.రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. పెంబర్తి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, బచ్చన్నపేట మ హాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల జూ నియర్ కాలేజీ, పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 200 వందల మొ క్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయని, మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో స్టేషన్‌ఘన్‌పూర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ ఎం.అనిత, అధ్యాపకులు పాల్గొన్నారు.
బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్
ఎంజేపీల్లో వనమహోత్సవం