
వైభవంగా బోనాలు
పాలకుర్తి టౌన్ : మండలంలోని మంచుప్పల గ్రామంలో ఆదివారం మారమ్మ, మహంకాళి అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల నృత్యాలతో వైభవంగా బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
గొల్లపల్లిలో..
దేవరుప్పుల : ఆషాఢం సందర్భంగా మండలంలోని గొల్లపల్లిలో ఆదివారం మహాంకాళి, మారమ్మలకు యాదవ కులస్తులు నజర్ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఒగ్గు కళాకారుల ఆటపాట, శివసత్తుల పూనకాలతో ఇంటింటా మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. గ్రామంలో వర్షాలు సమృద్ధి కురవాలని, పాడిపంటలు పండాలని భక్తులు మొక్కుకున్నారు. పెద్ద గొల్ల దూదిమెట్ల సోమలింగం, బయన్న, వర్రె కొమురయ్య, మాజీ సర్పంచ్ కోనేటి సుభాషిని నర్సయ్య, యాకన్న, తీగల వెంకన్న, తీగల సత్యనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

వైభవంగా బోనాలు