
ఎన్‌ఎస్‌పీసీలో మూడో స్థానం
జనగామ రూరల్: జాతీయ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 3 రకాల అంశాలపై రాష్ట్రాలకు కాంపిటీషన్ పోటీలు నిర్వహిస్తుంది. నేషనల్ స్టూడెంట్ పార్టీ స్పెషల్ కాంపిటీషన్ (ఎన్‌ఎస్‌పీసీ)లో ముఖ్యంగా చెత్త నిర్వహణ, మొక్కల పెంపుదల, భూగర్భ జలాల పెంపుదలపై పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీలో రాష్ట్రం, దేశంలో రెండవ స్థానంలో ఉండగా రాష్ట్రంలో జనగామ జిల్లా 3వ స్థానంలో ఉంది. ప్రజారోగ్యం, పరిశుభ్రత అనే మూడవ కీలక అంశంపై కూడా ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి పోటీల్లో పాల్గొనేలా చేయడం ద్వారా విద్యాలయాలు, వసతి ప్రాంతాల్లో హైజీన్, వేస్ట్ మేనేజ్‌మెంట్, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరుస్తూ, కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లా వ్యాప్తంగా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ‘మన జిల్లా మన నీరు’ అనే కార్యక్రమంతో వివిధ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదువేల ఇంకుడు ఇంతల నిర్మాణాలకు ప్రణాళిక చేపట్టారు. అదే సమయంలో వనమహోత్సవం కార్యక్రమం కింద వేలాది మొక్కలు నాటుతున్నారు.
విద్యార్థుల భాగస్వామ్యం..
విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలిని పెంపొందించాలని, మొక్కలు నాటటం, నీటి సంరక్షణ, వ్యర్థాలను వేరుచేసే అలవాట్లను విద్యార్థులకు పెంపొందించడానికి నేషనల్ గ్రీన్ కోర్ తయారు చేసిన నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీలు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్‌లు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నారు.
కొనసాగుతున్న రిజిస్ట్రేషన్
జూలై 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పోటీలు కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తుండగా ఫలితాలు ఆగస్టు 30న ప్రకటించనున్నారు. 1వ తరగతి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాల్లో పోటీ నిర్వహిస్తారు. ఎకో మిత్రం అప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని, హిందీ, ఇంగ్లిష్ మరిన్ని భాషల్లో క్విజ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ ఫొటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 1వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులతో పాటు సామా న్య పౌరులు కూడా పాల్గొనవచ్చు. పోటీలో పాల్గొ న్న ప్రతీ విద్యార్థికి వెంటనే ఈ–సర్టిఫికెట్ లభిస్తుంది. విద్యా సంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తారు.
పర్యావరణ
సమతుల్యతకు కృషి చేయాలి
జాతీయ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌పీసీ పోటీలో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలువగా ఆగస్టు 31 వరకు గడువు ఉంది. అన్నివర్గాల ప్రజల సహకారంతో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తాం. భూగర్భజలాలు సంరక్షించి వర్షపు నీటిని ఒడిసి పట్టి భవిష్యత్ తరాలకు అందించాలి. విద్యార్థులు ప్రతిఒక్కరూ పరిశుభ్రతపై బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. విరివిగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతకు కృషి చేయాలి.
– రిజ్వాన్ బాషా, కలెక్టర్
పర్యావరణ సమతుల్యతలో
విద్యార్థుల భాగస్వామ్యం
భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక కార్యక్రమం
కలెక్టర్ కృషితో ఉత్సాహంగా మొక్కలు నాటడం, ఇంకుడుగుంతల నిర్మాణం

ఎన్‌ఎస్‌పీసీలో మూడో స్థానం

ఎన్‌ఎస్‌పీసీలో మూడో స్థానం