
వరినారు ఎండుతోంది..
బచ్చన్నపేట : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పొలంలో వేసిన వరినారు ఎండిపోతుంది. నాటు వేసేందుకు దమ్ముచేసిన పొలాలు కూడా ఎండిపోతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన కామిడి శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డితో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ..వర్షాలు కురవక పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి నాటు వేసిన వరిపొలం ఎండిపోతున్నాయని తెలిపారు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపకపోతే మిగిలిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికై న సంబంధిత అధికారులు చొరవ చూపి చెరువులు, కుంటలను నింపాలని కోరారు.