
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి
పాలకుర్తి టౌన్: మంజూరైన ఇందిరమ్మ ఇల్లును గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారని ఆరోపిస్తు శుక్రవారం బమ్మెర గ్రామానికి చెందిన బరిగెల పోతన కుటుంబ సభ్యులతో శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోతన మాట్లాడుతూ రెండు నెలల క్రితం బమ్మెర వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ భాష తనకు ఇల్లు మంజూరు చేస్తూ కట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కాగా, గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇల్లు మంజూరు అయితే రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ధర్నాలో పోతన భార్య రేణుకతోపాటు ఇద్దరు పిల్లలు పాల్గొన్నారు.