జనగామ రూరల్: విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు అందించి ఆదుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడబోయిన మమత ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ పెంచిన బస్‌పాస్ చార్జీల ధరలు తగ్గించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రతీ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యార్థుల సమయపాలనకు అనుకూలంగా బస్సులు నడపాలన్నారు. విద్యార్థుల సమస్యలపై డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేదన్నారు. ఎక్కువ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని, ఎక్కువ ధరలు చెల్లించి చదివే స్థోమత లేక మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. ఆర్టీసీ యాజమాన్యం చొరవ తీసుకుని న్యాయం చేయాలన్నారు. అలాగే ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే ఎస్‌ఎఫ్‌ఐ జీప్ జాతాను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్, జిల్లా కార్యదర్శి దాసగాని సుమ, మామిడాల రమేశ్, భూక్యా యాకన్న రాథోడ్, బొమ్మిశెట్టి ఆర్య, నాయకులు శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.