జనగామ/: చదవడం, రాయడం వచ్చిన ప్రతీఒక్కరు ఓపెన్ స్కూల్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్ స్కూల్ పాఠశాల జిల్లా కమ్యూనిటీ మానిటరింగ్ ఆఫీసర్ నాగరాజు, కోఆర్డినేటర్ ఎం.శంకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలతో పాటు రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో ఓపెన్ స్కూల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడిమధ్యలో మానేసి 14 సంవత్సరాలు పైబడిన వారు పదో తరగతి పరీక్ష రాయడానికి అర్హులన్నారు. పదవ తరగతి పాసైన వారు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయవచ్చన్నారు. ఒకే సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్ష రాసి పాస్ కావచ్చన్నారు. జూలై 31 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కృష్ణమూర్తి, నర్సింహారెడ్డి, కనక య్య, సిద్ధిరాములు, మంజుల పాల్గొన్నారు.