
వసతి గృహాలపై నిరంతరం పర్యవేక్షణ
● గూగుల్ మీట్‌లో కలెక్టర్
రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: జిల్లాలోని వసతి గృహాలపై అధికారుల నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతిగృహాలు, కేజీబీవీల నిర్వహణపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్‌లో మాట్లాడారు. విషపురుగులు, క్రిమికీటకాలు వసతి గృహాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసర ప్రాంతాల్లో చెత్త, చెదారం లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు నిద్రించే గదులపై నిఘా ఉండాలని, స్వచ్ఛత ఉండేలా చూడాలన్నారు. ప్రతిరోజు పిల్లలకు వేడిచేసి చల్లార్చిన తాగునీటిని మాత్రమే అందించాలన్నారు. వసతి గృహాలకు సప్లయ్ చేసే బియ్యం, పాలు, నూనె, గుడ్ల నాణ్యతలో రాజీ ఉండకూడదన్నా రు. తాజా కూరగాయలను మాత్రమే వడ్డించాలన్నారు. వార్డెన్లు అందుబాటులో ఉండాలని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు శాతంతో పాటు వంట సామగ్రిని ప్రతిరోజు రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. పాము, కుక్కకాటు మందులతో పాటు సమీపంలోని పీహెచ్‌సీ వైద్యుల నంబర్లను వసతి గృహాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ గూగుల్ మీట్‌లో ఆర్డీఓలు, విద్య, వైద్య శాఖల అధికారులు, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపా ల్స్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
జీఓ 51ని రద్దు చేయాలి
కొడకండ్ల: జీఓ 51 రద్దుకు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ రాష్ట్ర నాయకుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలకేంద్రంలో సోమారపు వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన యూనియన్ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ దగా కోరు విధానాలతో రాష్ట్రంలో వేలాది మంది గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ సమస్యలు తీరుతాయని భావించిన కార్మికులకు నిరాశే ఎదురవుతుందన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇస్తూ పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి ప్రమాద బీమాను రూ.15లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సీఐటీయూ మండల అధ్యక్షుడిగా నూనెముంతల యాకన్న, ప్రధాన కార్యదర్శిగా నామాల ఐలయ్యతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్న, కోశాధికారి బస్వ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
విరబూసిన బ్రహ్మకమలం
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ గ్రామానికి చెందిన పెండెల నర్సింగరావు ఇంటి ఆవరణలో శుక్రవారం తెల్లవారు జామున బ్రహ్మకమలం విరబూసింది. పుష్పించిన బ్రహ్మకమలాన్ని గుర్తించిన నర్సింగరావుసత్యవతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులు విరబూసిన బ్రహ్మ కమలాన్ని చూసి ముగ్ధులయ్యారు. జూలై, సెప్టెంబర్ మాసంలో పుష్పించే బ్రహ్మకమలాన్ని ఎక్కువగా ఆయుర్వేదం, కేన్సర్, తలనొప్పి, విరిగిన ఎముకలకు ఔషధంగా వాడుతారని, రాత్రి సమయంలోనే ఎక్కువగా పుష్పిస్తుందని వేద పండితుడు కృష్ణమాచార్యులు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి పోరాటం
దేవరుప్పుల: రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం అనివార్యమని యూటీఎఫ్ స్టేట్ బో ర్డు ఆఫ్ డైరెక్టర్ ఆకుల శ్రీనివాసరావు అన్నా రు. శుక్రవారం మండలంలోని పెద్దమడూరుతో పాటు పలు పాఠశాలల్లో యూటీఎఫ్ సభ త్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారం కానందున ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మూడు దశలలో పోరా టం చేయబోతున్నామని వెల్లడించారు. మొద టి దశలో ఈ నెల 23, 24 తేదీల్లో మండల త హసీల్దార్లకు వినతి పత్రాలు, ఆగస్టు 1న జిల్లా స్థాయిలో, 23 రాష్ట్రస్థాయిలో ధర్నా చేపట్టాలన్నారు. మండల అధ్యక్షుడు జి. గోవర్దన్ రెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, సురేష్ బాబు పాల్గొన్నారు.

వసతి గృహాలపై నిరంతరం పర్యవేక్షణ

వసతి గృహాలపై నిరంతరం పర్యవేక్షణ