
ఎక్కువ మంది ఉన్నచోట ఇబ్బంది..
అన్ని సందర్భాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట, యూ ఆకారంలో కూర్చోబెట్టడం సాధ్యం కాదు. ఒక్కోసారి నల్లబల్ల అందరికీ కనిపించక మెడ నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఇంతటి విలువైన ఈ ప్రదేశంలో ప్రతి విద్యార్థికి సమానమైన ప్రాముఖ్యత ఇవ్వగలగాలంటే, ఆ గది విశాలంగా ఉండడంతో పాటు, అత్యంత సౌకర్యవంతంగానూ ఉండగలగాలి. విద్యార్థి క్షేమాన్ని కాంక్షించే ప్రతీ టీచర్ కూర్చున్న స్థలానికి ప్రాధాన్యం ఇవ్వకుండా వారి విద్యావికాసానికి శ్రద్ధ వహిస్తారు. –త్రిపురారి పద్మ, తెలుగు పండిట్
ఉపాధ్యాయురాలు