ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

Jul 17 2025 3:58 AM | Updated on Jul 17 2025 3:58 AM

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌

జనగామ రూరల్‌: మొక్కలే మానవాళికి మనుగడ అని, ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని అ దనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 13 షెడ్యూ ల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాలు, 5 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పా ఠశాలలో వన మహోత్సవం కార్యక్రమానికి పింకేష్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వన మహోత్సవం ప్రాధాన్యం, పర్యావరణం, జీవ వైవిధ్యంలో శాస్త్రవేత్తల పాత్ర తదితర అంశాలపై వివరించారు. గురుకుల పాఠశాల వంటగదిని విద్యార్థులకు అందిస్తున్న మెనూను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్‌ విక్రం కుమార్‌, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

స్టేషన్‌ఘన్‌పూర్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలను పెంచాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలో బుధవారం ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కనీసం ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రఘుపతి, పీడీ శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రవీందర్‌, నర్సింహాచారి, మున్సిపల్‌ అఽధికారులు నితిన్‌, సందీప్‌, శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement