
విద్యుత్ ఉద్యోగులను ఆదుకోవాలి
జనగామ రూరల్: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్‌ను బట్టి కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కె.ఈశ్వర్‌రావు అన్నారు. బుధవారం విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో డివిజనల్ ఇంజనీర్ ఆఫీస్ ఆవరణలో వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 19,600 మంది ఆర్టిజన్ కార్మికులను విద్యాఅర్హతలను బట్టి కన్వర్షన్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీఎస్సీ జాయింట్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, రాష్ట్ర కో కన్వీనర్ కందికొండ వెంకటేష్, వైస్ చైర్మన్ వెనమల నరేందర్, రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ కుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, జేఏసీ జిల్లా కన్వీనర్ జక్కుల యాకూబ్, కొంపెల్లి అశోక్, ఎల్లారెడ్డి, సుధాకర్, వెంకన్న, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
కన్న తండ్రిపై పోక్సో కేసు
దేవరుప్పుల: కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించిన కన్న తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు దేవరుప్పుల ఎస్సై ఊర సృజన్ కుమార్ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను కన్న తండ్రి లైంగికంగా వేధించాడు. ఈ విషయం తల్లికి చెప్పినప్పటికీ ఆమె స్పందించలేదు. మరోసారి వేధించడంతో సదరు బాలిక తన పెద్దమ్మకు జరిగిన విషయం తెలిపింది. ఆమె సహకారంతో బాలిక స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు బాధిత బాలిక తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఆ బాలికను బాలల సంరక్షణ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై చెప్పారు.
‘కే హబ్’ సందర్శన
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని టీహబ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తాలూకా, స్టాఫ్ డైరెక్టర్ బెంజిమిన్ బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని కే హబ్‌ను సందర్శించారు. ఈపర్యటన సందర్భంగా వారు కే హబ్‌లోని వసతులు, మౌలిక సదుపాయాలు, స్టార్టప్ సంస్థల అభివృద్ధికి అనుకూలంగా ఉండే సాంకేతిక శాసీ్త్రయ వాతావరణ పరిస్థితులపై వీసీ ప్రతా ప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో చర్చించారు. త్వరలోనే టీ హబ్, కే హబ్‌కు మధ్య ఎంఓ యూ కుదుర్చుకోనుందని రిజిస్ట్రార్ రామచంద్రం వెల్లడించారు. కార్యక్రమంలో రూసా నో డల్ ఆఫీసర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, కేయూ దూ రవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య బి.సురేశ్‌లా ల్, కె హబ్ డైరెక్టర్ టి.సవితాజ్యోత్స్న, డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎన్.వాసుదేవరెడ్డి, కిరణ్‌కుమార్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
పూర్తి ఫీజు రాయితీ
రామన్నపేట : టీజీ పాలిసెట్ –2025 కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్న అభ్యర్థుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, నవోదయ, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖల అధ్వర్యంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించనున్నట్లు వరంగల్ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, టీజీ పాలిసెట్ హెల్ప్‌లైన్ సెంటర్ క్యాంప్ ఆఫీసర్ డా.బైరి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీ పొందాలంటే అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను సందర్శించి తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94921 10750 నంబర్‌లో సంప్రదించాలని, లేదా అధికారిక వెబ్‌సైట్ http://tgpolycet.nic.in
ను సందర్శించాలని కోరారు.
‘యునైటెడ్ వే ఆఫ్
హైదరాబాద్’తో ఎంఓయూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌కు మధ్య ఎంఓయూ (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 250 మంది విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, డేటా సైన్స్ తదితర అంశాల్లో కేంద్రీకృత శిక్షణ ఇవ్వనున్నారు. ఈశిక్షణతో విద్యార్థుల్లో ఉద్యోగావకాశాల కోసం అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తారు. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ ఒప్పంద లక్ష్యం అని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ బుధవారం తెలిపారు.