
బహుమతుల ప్రదానం
జనగామ రూరల్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డులోని సేయింట్ మేరీ హైస్కూల్‌లో శుక్రవారం జిల్లా స్థాయి కామిక్ రైటింగ్ పోటీలు విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొని కార్టూన్‌లు గీసి తమ ప్రతిభను చాటారు. కాగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ భోజన్న గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో పోటీల ఇన్‌చార్జ్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి బొమ్మనబోయిన శ్రీనివాస్, శామ్యూల్ ఆనంద్, నవీన్, అనిల్ పాల్గొన్నారు.