స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక సౌకర్యాలతో పాటు అర్హత కల్గిన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నారని, ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సై మనీష అన్నారు. పాంనూర్ మండల పరిషత్ యూపీఎస్‌ను ఎస్సై శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సిరికొండ కుమారస్వామి ముగ్గురు పిల్లలను అదే పాఠశాలలో చేర్పించిన విషయం తెలుసుకుని ఉపాద్యాయుడిని, పిల్లలను ఎస్సై అభినందించారు. హెచ్‌ఎం రఘుప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.