
వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం వార, మాస కల్యాణంతో పాటు హోమ కార్యక్రమం నిర్వహించడంతో భక్తుల సందడి నెలకొంది. ఉదయం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల స్వామి వారి మాస, వార కల్యాణంతో పాటు హోమం నిర్వహించారు. భక్తులకు హైదరాబాద్, వరంగల్‌కు చెందిన బోడ మహేష్–వినీష, ముసిని నరేందర్–లావణ్య దంపతులు అన్నప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, ధర్మకర్తలు పాల్గొన్నారు.
నిడిగొండ త్రికూటాలయాన్ని పునరుద్ధరించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్
రఘునాథపల్లి: హనుమకొండ వేయి స్తంభాల ఆలయం తరహాలో నిడిగొండ త్రికూటాలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం శిథిలావస్థలో ఉన్న మండలంలోని నిడిగొండ త్రికూటాలయాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరుద్ధరణ పేర ఆలయ కళాఖండాలు కుప్పగా పోసి వదిలేయడంతో అవి నేలలో కూరుకు పోతున్నాయన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయం పునఃనిర్మించి దేవాదాయ శాఖ ఆదీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణుకుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కావటి ముత్యాల్‌యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి సోమేశ్వర్, ద్యావర రాజు, మల్కపురం శ్రీకాంత్, దైతల రంజిత్, చెవ్వ రాజు, యామంకి కొమురెల్లి, మహేందర్‌జీ, రవి, కమలాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి