
సర్కారు బడులకు ఉచిత ఇంటర్నెట్
జనగామ: సర్కారు బడుల్లో అమలు చేస్తున్న ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. సమగ్ర శిక్షలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ భాగస్వామ్యంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడతలో కంప్యూటర్లు అందుబాటులో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపిక చేయడంతో పాటు వాటికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 75 పీఎస్, యూపీఎస్‌లను గుర్తించారు. పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించి ఫార్మెట్ ప్రకారం ప్రతీ శనివారం ఈ–మెయిల్ ద్వారా ప్రభుత్వానికి జిల్లా విద్యాశాఖ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైన వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలని అందులో పేర్కొన్నారు. ఉచిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కాబోతుండడంతో ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రాంతో పాటు ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పోతుంది.
జిల్లాలో అర్హత పొందిన పాఠశాలలు
మండలం పాఠశాలలు
బచ్చన్నపేట 10
చిల్పూరు 5
దేవరుప్పుల 4
స్టేషన్‌ఘన్‌పూర్ 9
జనగామ రూరల్ 11
జనగామ అర్బన్ 4
కొడకండ్ల 3
లింగాలఘణపురం 5
నర్మెట 2
పాలకుర్తి 4
రఘునాథపల్లి 11
తరిగొప్పుల 3
జఫర్‌గఢ్ 4
మొత్తం 75
జిల్లాలో 75 పీఎస్, యూపీఎస్‌లు ఎంపిక
బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి సేవలు
ఎఫ్‌ఎల్‌ఎన్ మెరుగు పరిచేందుకు..