
హరిత టీచర్లు
పూలు..పండ్లు..ఔషధ మొక్కలు
పై ఫొటో దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బి ల్లా యాదవరెడ్డి, అండాలు దంపతులు. యాదవరెడ్డి 20ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగే క్రమంలో 9 గుంటల వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఒక గుంట స్థలం ఇల్లు నిర్మాణం చేయగా మిగతా ఖాళీ స్థలంలో భార్య అండాలుతో కలిసి రకరకాల మొక్కలు నాటగా, నేడు ఆ స్థలమంతా హరితమయంగా మారిపోయింది. పచ్చని హరివిల్లులో రాజకీయాలకతీతంగా సేదతీరుతూ ముచ్చటించుకునే ప్రతి ఒక్కరు ఈ దంపతులు చల్లంగా ఉండాలని కోరుకుంటారు. – దేవరుప్పుల
జనగామ: కాలుష్య రహితంగా మారుతున్న పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. అంతరించి పోతున్న అడవులు.. అభివృద్ధి పేరిట మాయమైపోతున్న మహావృక్షాలతో స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితి లేకుండా పోతుంది. ఈ నేపధ్యంలో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ప్రేమికులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటి పెరట్లో పచ్చదనం పెంచుతూ.. ఔషధ, పూలు, పండ్ల మొక్కలతో స్వచ్ఛమైన వాతావరణంలో జీవనం సాగిస్తుంటే.. బడిలో పాఠాలతో పాటు మొక్కలు నాటే ప్రత్యక్ష బోధన చేస్తున్నారు టీచర్లు. చెరువు కట్టలు, ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాల్లో సమాజ ప్రేమికులు మొక్కలను నాటుతూ వాటి సంరక్షణకు జీ వితాలనే త్యాగం చేస్తూ రేపటి తరానికి ఆయుష్షు పోసేందుకు తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో హరితహారంపై ‘సాక్షి’ స్ఫూర్తి కథనం.
నర్మెట: ఆ దంపతులకు పచ్చదనం అంటే అమితమైన ప్రేమ. మొక్కలను సంరక్షించడంలో ఆదర్శంగా నిలుస్తారు. స్వచ్ఛమైన వాతావరణం ఇంటినే పచ్చదనంగా మార్చుకున్నారు. స్వచ్ఛదనంలో ఆరోగ్య ప్రదాయనిగా పిలుచుకునే ఔషధ మొక్కలను పెంచుతూ పర్యావరణ ప్రేమికులుగా పిలువబడుతున్నారు నర్మె ట మండల కేంద్రానికి చెందిన మహేశ్వరం అనిత, మురళి దంపతులు. రెండు దశాబ్ధాలుగా ఇంటి పెరట్లో 21 రకాల పూలు, పండ్లు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు.
చెట్లు అంటే ప్రాణం
పర్యావరణ ప్రేమికుడు ఈ టీచర్
విద్యార్థుల భాగస్వామ్యంతో
మొక్కల సంరక్షణ
ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు
ఇంటి పెరటితోటల్లో ఔషధమొక్కలు
హరితహారంపై ‘సాక్షి’ స్ఫూర్తి కథనం

హరిత టీచర్లు

హరిత టీచర్లు

హరిత టీచర్లు

హరిత టీచర్లు