
ఓటరుగా నమోదు చేయించాలి
● ఆర్డీఓ గోపీరామ్
బచ్చన్నపేట: 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయించాలని జనగామ ఆర్డీఓ గోపీరామ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో బీఎల్‌ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, ఎంఆర్‌ఐలు వంశీ కృష్ణ, మున్వర్, ఆయా గ్రామాల బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
తరిగొప్పుల: రాబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఏడెల్లి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు నెలాఖరులోగా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు.ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపున్చిరు.
మండల అభివృద్ధికి కృషి
దేవరుప్పుల: మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎంపీడీఓ టి సురేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల ఎంపీడీఓగా ఉన్న కె.లక్ష్మీనారాయణ ఉద్యోగ విరమణ పొందడంతో ఎంపీఓ కొనసాగుతున్న టి.సురేష్‌కుమార్‌కు జిల్లా సీఈఓ.. ఎంపీడీఓగా ఉత్తర్వులు జారీ చేయడంతో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా మండల పరీశీలనకు వచ్చిన డీపీఓ స్వరూప శుభాకాంక్షలు తెలిపారు.

ఓటరుగా నమోదు చేయించాలి

ఓటరుగా నమోదు చేయించాలి