
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం
జనగామ: పట్టణంలోని 12వ వార్డులో శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిట్ల అంజమ్మ, పళ్ళ రమ, వంగ యుగేందర్, ఎనగందుల వెంకటేష్, శ్రీరామ్ శ్రీనివాస్, వెంకటేష్, సమ్మయ్య, కుడికాలు రాజు ఉన్నారు.
‘దేవాదుల’ నుంచి నీటిని విడుదల చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు చెందిన ఛాగల్లు పంప్‌హౌజ్ నుంచి ఛాగల్లు, విశ్వనాథపురం, ఇప్పగూడెం, పాలకుర్తి తదితర ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని ఛాగల్లు మాజీ ఎంపీటీసీ కనకం స్వరూప, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గణేష్ డిమాండ్ చేశారు. ఛాగల్లు పంప్‌హౌజ్ కెనాల్ నుంచి రిజర్వాయర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో రైతులతో కలిసి వారు శుక్రవారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం దున్నకాలు, వరినాట్ల సమయం కావడంతో సాగునీరు అందక ఛాగల్లు, విశ్వనాథపురం, ఇప్పగూడెం తదితర ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వేసిన వరినాట్లు, పత్తి మొక్కలు ఎండిపోతున్నాయని, కనీసం పశువులకు సైతం నీరు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారన్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించాలని, ఛాగల్లు పంప్‌హౌజ్ కెనాల్ నుంచి నీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.