
మౌలిక వసతుల కల్పనకు కృషి
రఘునాథపల్లి: ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. శుక్రవారం పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థుల సంఖ్య పెంచిన హెచ్‌ఎం ఆలేటి యాదవరెడ్డి, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. పాఠశాలకు మూడు అదనపు తరగతి గదులు, సరిపడు టాయిలెట్స్ మంజూరు చేయాలని హెచ్‌ఎం వినతి పత్రం అందజేశారు. తరగతి గదుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు శ్రమదానంతో గదులు నిర్మించుకోవడాన్ని చూసి రాంబాబు వారిని అభినందించారు. మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్‌ఛందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, తోటకూర రమేష్, మేకల నరేందర్ పాల్గొన్నారు.