
జీఎంసీ ప్రిన్సిపాల్ బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ మెడికల్ కళాశాల ప్రిన్సి పాల్‌గా ఫ్రొఫెసర్ డాక్టర్ నాగమణి(మైక్రో బయాలజీ) గురువారం బాధ్యతలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మెడికల్ కళాశాలలో మైక్రో బయాలజీ ఫ్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె, బదిలీపై ఇక్కడకు వచ్చారు. పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ అన్వర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ అనురాధ, పిడియాట్రిక్స్ ప్రొఫెసర్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ జితేంద్ర, ఆప్తాల్మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పద్మిని, ఫిజియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ, ఎస్‌పీఎం అసోసియేట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు ఆమెను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
హాల్ టికెట్లు డౌన్‌లోడ్
చేసుకోవాలి
జనగామ రూరల్: సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి డాక్టర్ విక్రమ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత పరీక్ష జూలై 13వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత వసతి, భోజనంతో 10 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
నీటిని ఒడిసి పట్టండి
లింగాలఘణపురం: ప్రతి సబ్‌సెంటర్‌లలో ఇంకుడు గుంతలను నిర్మించి నీటిని ఒడిసి పట్టాలని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు సూచించారు. మండలంలోని నెల్లుట్ల సబ్‌సెంటర్‌లో నిర్మించిన ఇంకుడు గుంతను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతి చోట ఇంకుడు గుంతలను నిర్మించాలని సిబ్బందికి చెప్పారు. తద్వారా భూగర్భజలాలు పెరిగి ప్రజలకు ఉపయోగపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్వర్ణలత, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
బోగస్ హామీలతో
కాంగ్రెస్ మోసం
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కొడకండ్ల: సార్వత్రిక ఎన్నికల్లో బోగస్ 420 హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలకేంద్రంలో బీఆర్‌ఎస్ నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం సిందె రామోజీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడారు. తెలంగాణలో బ్లాక్ మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడువడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోసపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కే 80 శాతం అనుకూలంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. రామేశ్వరం గ్రామ కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్య నరేష్‌తోపాటు పలువురు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్ బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్, పేరం రాము, అభిమన్‌గాంధీ, సోమరాములు, జ్యోతి, రాజిరెడ్డి, విజయమ్మ, సతీష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘నీట్’లో జనగామ
విద్యార్థినికి ఉత్తమ ర్యాంకు
జనగామ: వైద్యవృత్తి కోర్సు అభ్యసన కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బొగ్గారపు శ్రీనివాసు, వాణిశ్రీ కుమార్తె బొగ్గారపు సాయి సంయుక్త జాతీయ స్థాయిలో 5,153, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 164 ర్యాంకు సాధించారు.

జీఎంసీ ప్రిన్సిపాల్ బాధ్యతల స్వీకరణ

జీఎంసీ ప్రిన్సిపాల్ బాధ్యతల స్వీకరణ

జీఎంసీ ప్రిన్సిపాల్ బాధ్యతల స్వీకరణ