
ముగిసిన సమ్మర్ ఇంటర్న్‌షిప్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సమ్మర్ ఇంటర్న్‌షిప్–25 ప్రోగ్రాం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. నిట్ వరంగల్‌లో తొలిసారిగా మే 9వ తేదీన ప్రవేశపెట్టిన సమ్మర్ ఇంటర్న్‌షిప్‌నకు అనూహ్య స్పందన లభించిందని, యూజీ, పీజీ నుంచి 194 విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇక ప్రతిఏటా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్, ప్రొఫెసర్ వెంకయ్య చౌదరి, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.