
ప్రజాసమస్యలు పరిష్కరించాలని ధర్నా
జనగామ రూరల్: పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ప్రజలకు సక్రమంగా సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు జనాభాకు అనుగుణంగా లేకపోవడంతో పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండటంతో దుర్వాసన వస్తుందన్నారు. ఏసి రెడ్డి నగర్‌లో డబుల్ బెడ్రూంలో సీసీ రోడ్డు డ్రెయినేజీ నిర్మించాలని, అర్హులైన పేదలందరికీ కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు అహల్య, బొట్ల శేఖర్, బూడిది గోపి, చుంచు విజయేందర్, చందు నాయక్, పొతుకునూరి ఉపేందర్, కల్యాణం లింగం పల్లెలు లలిత, పందిళ్ల కల్యాణి, బొట్ల శ్రావణ్, పాము కుంట్ల చందు, పాము శ్రీకాంత్, పగిడిపల్లి బాలమణి తదితరులు పాల్గొన్నారు.
పోరాటాలకు సిద్ధం కావాలి
రఘునాథపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం మండలంలోని కుర్చపల్లిలో సీపీఎం రెండు రోజుల మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, గంగాపురం మహేందర్, కాసాని పుల్ల య్య, మంచాల మల్లేష్, బీమగోని చంద్రయ్య, మైలారపు వెంకటేశ్వర్లు, యాదగిరి, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.